26-11-2024 10:54:53 PM
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి (విజయక్రాంతి): సొంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం లక్ష్మాపూర్ క్యాంపు గ్రామం నుండి అక్బర్ నగర్ గ్రామం వరకు కోటి రూపాయలతో నిర్మించనున్న మెటల్ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ప్రజలకు మేలు చేస్తున్నారన్నారు.. సొంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అక్బర్ నగర్లోని ఫుడ్ సైన్స్ కళాశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.