నిర్మల్, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆర్టీసీకి అద్దె బస్సులు నడుపుతున్న యజమానులు డ్రైవర్లకు వేతనాలు పె ంచాలని డ్రైవర్డు డిమాండ్ చేశారు. లేదంటే సోమవారం నుంచి అద్దె బస్సులు నడుపబోమని స్పష్టం చేశారు. ఆదివారం నిర్మల్ బస్ డిపో ఎదుట ఏఐటీయూసీ నాయకులతో కలిసి ధర్నా చేశారు. కనీస వేతనాల చట్టం ప్రకారం డ్రైవర్లకు రూ.18వేలు చెల్లించాలని, క్లీనర్లకు రూ.12వేలు ఇవ్వాలని కోరారు.