24-02-2025 12:00:00 AM
మంత్రి సీతక్కకు ఔట్‌సోర్సింగ్ వర్కర్ల వినతి
మణుగూరు (విజయ క్రాంతి) : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సర్కులర్ ప్రకారం ఇస్తున్న జీతాలను తగ్గించాలనే ప్రభుత్వ చర్యలను వెంటనే నిలిపివేయాలని, ఇంటర్, డిగ్రీ, పోస్టుమెట్రిక్ హాస్టల్స్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్లకు జీవో నెంబర్ 60 ప్రకారం నెలకు రూ.15,600/- వేతనం ఇవ్వాలని కోరుతూ ఆదివారం మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో హాజరయ్యేందుకు మణుగూరుకు వచ్చిన గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్కను సీఐటీయూ మండల బాధ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు సత్రపల్లి సాంబశివరావు మాట్లాడుతూ.. డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు. వేతన రక్షణ చట్టానికి విరుద్ధంగా వేతనాలు తగ్గించాలని ప్రయత్నించడం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని సిఐటియు నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
స్పందించిన మంత్రి సీతక్క సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారించేందుకు కృషి చేస్తానని హావిునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షురాలు కొండ్రు గౌరీ. చంద్రయ్య. భద్రమ్మ. తదితరులు పాల్గొన్నారు.