calender_icon.png 21 September, 2024 | 12:19 PM

చేనేత కళాకారులకు ప్రోత్సాహం అందిస్తాం

28-07-2024 12:11:09 AM

హ్యాండ్లూమ్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేనేత కళాకారులకు ప్రోత్సాహం అందించి వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ను అందించడానికి కృషి చేస్తుందని హ్యూండ్లూమ్, ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీని ఆమె శనివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చేనేతకారులను ఇండియన్ సిల్క్ గ్యాలరీ ప్రోత్స హిస్తుందని, ఇండియన్ సిల్క్ గ్యాలరీలో నాణ్యమైన పట్టు, కాటన్ వస్త్రాలకు ఖచ్చితమైన గ్యారెంటీ ఉంటుందన్నారు. తెలంగాణ టూరిజం సహకారంతో ఈ ఎగ్జిబిషన్లలో వినియోగదారులకు చేనేత వస్త్రాలను అందుబాటులో ఉంచామన్నారు.

సిల్క్ ఇండియా సీఈవో వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన 80 స్టాల్స్ ఈ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశామన్నారు. బోనాలు, వరలక్ష్మి వ్రతాలకు, శుభకార్యాలకు అనువుగా పోచంపల్లి, మదనపల్లి, వెంకటగిరి, చెందేరి, ఇక్కత్, నారాయణపేట్, బెనారస్, కొలకతాకు చెందిన విభిన్న మైన అరుదైన చీరలు ఇక్కడ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధి ఇందిర గుమ్మిల, తెలంగాణ టూరిజం ప్రతినిధులు పాల్గొన్నా రు. ఈ ప్రదర్శన ఆగస్టు 5వ తేదీ వరకూ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.