calender_icon.png 24 January, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10/10 ఉత్తీర్ణత సాధించిన వారికి సెల్ ఫోన్లు ఇస్తాం

24-01-2025 12:00:00 AM

పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ బంపర్ ఆఫర్...!  

నాగర్‌కర్నూల్ జనవరి 23 (విజయక్రాంతి): పదవ తరగతిలో మొదటి గ్రేడ్ సాధించిన ప్రతి విద్యార్థికి ఒక సెల్ ఫోన్ బహుమతిగా ఇస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రకటించారు.  గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థు లకు మెనూ ప్రకారమే నాణ్యత, ప్రమాణాలను పాటిస్తూ పౌష్టిక ఆహరం అందించవలసిన బాధ్యత పాఠశాల సిబ్బంది వంట ఏజెన్సీపై ఉందన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. 

మౌలిక వసతుల కల్పన విషయంలో విద్యార్థులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  వారి వెంట ఆర్డిఓ బన్సీలాల్, తహసిల్దార్ విష్ణువర్ధన్ రావు, పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.