25-04-2025 01:20:39 AM
ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య
నిజామాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): పహాల్గాం ఉగ్ర దాడి ప్రతీకారం తప్పకుండా తీసుకుంటామని ఎమ్మెల్సీ మాల్కా కొమురయ్య అన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడులు జరిగిన సంఘటనలో మృతి చెందిన వారి ఆత్మశాంతికై మౌనం పాటించి నివాళులర్పించారు. గురువారం నిజామాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మల్కా కుమారయ్య మాట్లాడుతూ ఒక మతానికి చెందిన వారిని టార్గెట్ గా చేస్తూ ఉగ్ర దాడులు జరిగాయని పర్యాటకు లోను పొట్టన పెట్టుకోవడం ఉగ్రదాడు లను ఆయన తీవ్రంగా ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి ముష్కరులకు గట్టి ఇది చెప్పే పనిలో నిమగ్నమై ఉందని భారత పౌరులు అందరూ భారత ప్రభుత్వానికి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి అతిపెద్ద సంఘటనా అని ఆయన అన్నారు. గతంలో ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు జమ్మూకాశ్మీర్ సమస్యను సమస్య ఆత్మకంగానే ఉంచి పాకిస్తాన్ కు మద్దతుగా ఉగ్రం ముక్కలకు పరోక్షంగా సహాయపడ్డారని మల్కా కొమురయ్య ఆరోపించారు.
ఉపాధ్యాయ విద్యార్థుల సమస్యలపై కార్యాలయ ప్రారంభం ఉపాధ్యాయ సమస్యలపై అన్ని సంఘాలతో సమావేశం జరిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు సైతం తమ దృష్టికి తేవాలని కోరిందని విద్యా వ్యవస్థను విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకై నిజామాబాద్ జిల్లా బిజెపి కార్యాలయం పై అంతస్తులు ఎమ్మెల్సీ కార్యాలయం ప్రారంభించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు టీచర్లకు అయినా హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమస్యలు ఎదురైతే నేరుగా తమ కార్యాలయానికి వచ్చి సమస్యలపై ఫిర్యాదు చేయాలని తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.