calender_icon.png 18 April, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతింటి కలను నేరవేర్చుతాం

24-03-2025 01:17:27 AM

ప్రతి నిరుపేదకు సాకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

భద్రాచలం, మార్చి 23: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చుతామని, పేదలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం భద్రాచలంలోని ఏఎంసీ కాలనీలో అసంపూర్తిగా ఉన్న 117 ఇళ్లను రూ 7.36 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం లబ్ధిదారులకు అందించిన ఇళ్లకు అన్ని వసతి సౌకర్యాలు కల్పించి అందించామన్నారు. గత 10 సంవత్సరాల్లో ఇళ్లు కట్టించి అసంపూర్తిగా వదిలివేయడంతో తమ ప్రభుత్వం 156 ఇళ్లలో 96 ఇళ్లు పూర్తిచేసి అందించామన్నారు.

మరికొన్ని ఇళ్లు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించి పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టడానికి పైలెట్ ప్రాజెక్టుగా  తీసుకొన్నామన్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.387 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఉగాదిలోపు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. దశలవారిగా అందిరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల డేవిడ్ రాజ్, సీఈవో నాగలక్ష్మి, డీఆర్డీవో విద్యాచందన పాల్గొన్నారు.