మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శా ఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం లో మంత్రి పర్యటించారు.
అనంతరం ఖ మ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్‌బాబుతో కలిసి 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 92 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో గణేశ్, తహసీల్దార్ రాంప్రసాద్ పాల్గొన్నారు.
బుధవారం మంత్రి ఖమ్మం టీఎన్జీవోస్ కాలనీలో చేపట్టిన డంపింగ్ యార్డ్ అప్రోచ్, ఇంటర్నల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణపై మున్సిపల్ సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఒకటో డివిజన్ కార్పొరేటర్ హుస్సేన్ పాల్గొన్నారు.