calender_icon.png 25 November, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

25-11-2024 01:49:53 AM

  1. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  2. హుజూర్‌నగర్‌లో విజయోత్సవ సభ

హుజూర్‌నగర్, నవంబర్ 24: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చరితాత్రాత్మకమని రాష్ట్ర నీటిపారుదల, పౌరస రఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

బీఆర్‌ఎస్ హయాంలో కొనసాగిన నిరంకుశ పాలనను ప్రజలు వ్యతిరేకించి కాంగ్రెస్‌కు పట్టం కట్టి ప్రజా ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. అధికారం చేపట్టిన 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాల నియమాకాలు చేపట్టి నిరుద్యోగులకు అండగా నిలిచామన్నారు.

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీ కానీ రైతులకు జనవరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఇండ్లు లేని నిరుపేదలందరికి రూ.5లక్షలు అందించి ఇంటి నిర్మాణం చేపట్టనున్నామన్నారు.

నీటి పారు దలశాఖ ద్వారా కాళేశ్వర ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టడంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగుకు నీరందించే లక్ష్యంతో నీటిపారుదలశాఖ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో 158 మెట్రిక్ టన్నుల వరి సాగు అయి దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వయా హుజూర్‌నగర్, కోదాడ మీదుగా రైల్వేలైన్‌కు  ప్రతిపాదనలు పంపామన్నారు.

ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో పసలేదని, ప్రజా ప్రభు త్వం ప్రజలకిచ్చిన హామీలన్ని వందశాతం అమలు చేస్తామన్నారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గ ప్రజలే మా కుటుంబమని ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజలకు తమ జీవితం అంకితమన్నారు. మూసీ ప్రక్షాళనతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయకట్టు పెరగడంతో పాటు జిల్లాకు సురక్షితమైన సాగునీరు అందుతుందన్నారు.

66.7లక్షల ఎకరాల్లో 40 లక్షల రైతాంగం సాధించిన ఘనత అన్నారు. సామాజిక  న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, రాహుల్‌గాంధీ నాయకత్వంతో కులగణన చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, తుది నివేదిక రాగానే వర్గీకరణ అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్  తేజస్ నందలాల్‌పవార్, రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ చైర్మన్ అలేఖ్య, కోదాడ, తుంగుతుర్తి ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, మందుల సామేల్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెవిటి వెంకన్నయాదవ్, మున్సిపల్ చైర్మన్లు గెల్లి అర్చనరవి, ప్రమీల, ప్రకాష్, వైస్ చైర్మన్ సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల తనిఖీ 

హుజూర్‌నగర్, నవంబర్ 24: వేపలసింగారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనిఖీ చేశారు. రైతులు సమయానికి లారీలు రావ డంలేదని ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు.