calender_icon.png 21 March, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తాం

21-03-2025 01:58:41 AM

 దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ 

దేవరకొండ, మార్చి 20 (విజయక్రాంతి) :  ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ తూ.చా. తప్పక నెరవేరుస్తామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. చింతపల్లి మండలం కిష్టరాయిన్ పల్లి, పీకే మల్లేపల్లి, ఎం. మల్లేపల్లిలో గురువారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.

నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని పేర్కొన్నారు. గత పాలకుల ధోరణి కారణంగా గ్రామీణ ప్రాంతాలు ప్రగతికి నోచుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే దిక్సూచీగా మారిందన్నారు.

సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు దేవరకొండలోని సీపీఐ కార్యాలయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.