calender_icon.png 23 January, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీసీ రూల్స్‌ను పాటిస్తాం: బీసీసీఐ

23-01-2025 12:00:00 AM

  1. టీమిండియా జెర్సీపై పాక్ లోగో
  2. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. సంప్రదాయం ప్రకారం ఆతిథ్య హోదా హక్కులు దక్కించుకున్న పాక్ లోగో ఉన్న జెర్సీని ధరించాలని ఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బుధవారం ఉదయం పాక్ లోగో ఉన్న జెర్సీని ధరించడానికి టీమిండియా నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ వార్తలను కొట్టిపారేసిన బీసీసీఐ అధ్యక్షుడు దేవజిత్ సైకా ఐసీసీ రూల్స్‌ను పాటించనున్నట్లు తెలిపారు. ‘ ఆ వార్తలన్నీ అవాస్తవం. చాంపియన్స్ ట్రోఫీని పాక్‌లో ఆడేందుకు మాత్రమే నిరాకరించాం. పాక్ లోగో ఉన్న జెర్సీని ధరించడానికి టీమిండియాకు అభ్యంతరం లేదు.

లాహోర్ వేదికగా జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫోటోషూట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనడంతో పాటు ప్రీ ఈవెంట్ కాన్ఫరెన్స్‌పై చర్చిస్తున్నాం. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తాం’ అని దేవజిత్ తెలిపారు. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న మెగాటోర్నీకి సంబంధించి ఐసీసీ డ్రెస్ కోడ్‌ను రిలీజ్ చేసింది.

ట్రోఫీలో పాల్గొననున్న 8 జట్లు తమ జెర్సీలపై ఆతిథ్య దేశం లోగోను ముద్రించాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. భద్రతా కారణాల రిత్యా పాక్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రీడ్ మోడ్‌ను తెరమీదకు తెచ్చిన ఐసీసీ టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నింటిని దుబాయ్ వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

అయితే ఒక మీడియా మాత్రం పాక్ లోగో ఉనన జెర్సీని టీమిండియా ధరించబోవడం లేదంటూ వార్తలు వచ్చాయి. రంగంలోకి దిగిన దేవజిత్ ఐసీసీ రూల్స్‌కు బీసీసీఐ వ్యతిరేకంగా నడుచుకోదని స్పష్టంగా పేర్కొన్నారు.