calender_icon.png 8 January, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం

05-01-2025 01:33:30 AM

  • అగ్నిమాపక శాఖ మరింత బలోపేతానికి చర్యలు 

‘ఫైర్’ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ‘టీజీ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్’లో శనివారం 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసిం గ్ అవుట్ పరేడ్‌కు మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లు గా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీని తిరిగి పట్టాలెక్కించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఏర్పడిన న్యాయపరమైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియామక పత్రాలను అందజేస్తున్నామని చెప్పారు. హోం శాఖలో ఖాళీలను భర్తీ చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వెల్లడించారు. ఖమ్మంలో వరదలు తలెత్తినప్పుడు అగ్నిమాపక సిబ్బంది కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.

ఆపత్కాలంలో అగ్నిమాపక సిబ్బందిపై గురుతర బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు. ఎక్కడ విపత్తు తలెత్తినా మేమున్నామంటూ రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతూ పెద్దన్నగా నిలుస్తున్నారని ‘అగ్నిమాపక సిబ్బంది సేవలను ప్రశంసించారు. ఏడాది వ్యవధిలోనే అగ్నిమాపక శాఖలో 878 మం దిని రిక్రూట్ చేశామని ప్రకటించారు.

రాబో యే రోజుల్లో ఈ శాఖను మరింత బలోపే తం చేస్తామని తెలిపారు. విపత్తులు తలెత్తినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుండాలి సూచించారు. 4 నెలల కఠో ర శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్లకు అభినందనలు తెలియజేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ దయానంద్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, ఫైర్ డీజీ నాగిరెడ్డి పాల్గొన్నారు.