చేవెళ్ల, నవంబర్ 11: అడ్వాన్స్‌డ్ టెక్నాల జీ, అధునాతన మిషనరీలను ఉపయోగించి రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడుస్తున్నామని ఆర్‌అండ్‌బీ, సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మొయినాబాద్ మండలం చిల్కూరు చౌరస్తా నుంచి చేవెళ్ల మండలంలోని తంగేడుపల్లి వరకు రూ.3 కోట్లతో చేపట్టిన రోడ్డు ప్యాచ్‌వర్క్ పనులను సోమవారం మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనతో కలిసి ఆయన ప్రారంభించారు.
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 9వేల కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్, పీసీబీ మెంబర్ సత్యనారాయణ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.