మహాధర్నాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల, జనవరి 30 : చేర్యాల ప్రాంతం కళలకు కానాచిగా ఉంది.. ఆధ్యాత్మికానికి కేంద్రంగా ఉంది.. త్యాగాలకు నిలయంగా ఉంది.. ప్రజలకు అవసరంగా ఉంది.. కాబట్టే రెవెన్యూ డివిజన్ అనేది ప్రజల న్యాయమైన డిమాండ్ అని, ఈ డిమాండ్ నెరవేరేవరకు ప్రజల తరఫున పోరాడుతానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
గురువారం రోజున చేర్యాల పట్టణం లో జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ ప్రజలుఏదైతే కోరుతున్నారో, దానికోసం నిలబడి కొట్లాడుతానన్నారు. రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
భూమికోసం భుక్తి కోసం ప్రాణ త్యాగాలు చేసిన గడ్డఇది అని, ఈ గడ్డమీద పుట్టిన బిడ్డగా తన ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తానన్నా రు. టీచర్ల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ అనేది ఈ ప్రాంత ప్రజల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.
త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలిలో చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశా న్ని గురించి మాట్లాడుతానన్నారు. గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్, తెలంగాణతల్లి విగ్రహాలకు పూలమాల వేశారు.
కార్యక్రమంలో నాయకులు మోకు కనక రెడ్డి, కే ఎల్ వి ఎన్ రెడ్డి, వకుళాభరణం నరసయ్య పంతులు, ముస్తాల బాల నర్సయ్య, ఆముదాల మల్లారెడ్డి, బూర్గు సురేష్ గౌడ్, ఒగ్గు రాజు, సుంకారి మల్లేషం, నాచగోని పద్మ వెంకట్ గౌడ్, కర్ణాకర్, సిల్వర్ సిద్ధప్ప, తలారి కిషన్ పాల్గొన్నారు.