calender_icon.png 30 October, 2024 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల హామీలు నెరవేర్చే వరకు పోరాడతాం

08-07-2024 12:59:35 AM

జూలై 9న ధర్నా చేస్తాం

బీజేపీ మహిళా మోర్చా రాష్ర్ట అధ్యక్షురాలు శిల్పారెడ్డి

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటి నా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం చూస్తే మహిళలపై కాంగ్రెస్ సర్కారుకు చిత్త శుద్ధి లేదని ఇట్టే అర్థం అవుతుందని బీజేపీ మహిళా మోర్చా రాష్ర్ట అధ్యక్షురాలు శిల్పారెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ, తెలంగాణ మహిళలకు అండగా జూలై 9న ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన హామీలపై ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కూడా లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.