calender_icon.png 6 February, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండవ ఏఎన్ఎంలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం

06-02-2025 05:43:55 PM

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్... 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం డిఎంహెచ్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన హామీని అమలు పరచడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దివాకర్, రెండవ యూనియన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ ప్రమీల, వనిత, పద్మ, జ్యోతి, సత్యవాణి, విజయలక్ష్మి, రాజేశ్వరి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.