21-12-2024 08:06:47 PM
ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలి...
సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డిలో సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబెడ్కర్ స్టడీ సర్కిల్ లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ న్యాయవాది రామారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ హోం శాఖ మంత్రిగా పనిచేస్తున్న అమిత్ షా నిండు రాజ్యసభలో మహనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. అంబేద్కర్ పీడిత వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ఆలాంటి మహనీయుపై అనుచితంగా మాట్లాడటం సరియైనది కాదని బిజెపి మొదటి నుండి బయట అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూనే అంబేద్కర్ వాదాన్ని భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారని రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలని చూస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల కుట్రలను సాగనివ్వమని అన్నారు.
తక్షణమే అమిత్ షాను హోంమంత్రి పదవి నుండి తొలగించలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవమానించినందుకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సామాజిక ప్రజా ఉద్యమ నాయకులు బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్ ఎం బి టి నాయకులు అన్వర్, న్యాయవాది లక్ష్మి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బి అశోక్, సీనియర్ దళిత నాయకులు నాగయ్య, గిరిజన సంఘం నాయకులు జైపాల్ నాయక్, రాజేందర్ నాయక్, ప్రవీణ్ బస్వరాజ్, బాల్రాజ్, ఉదయ్, యాదగిరి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.