బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
ముషీరాబాద్, జూలై 12: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్‌లను జనాభా దామాషా ప్రకారం పెంచే వరకు ఉద్యమాన్ని ఆపబోమని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. ఈ నెల 14 నుంచి 31 వరకు పది జిల్లాల్లో సమగ్ర కుల గణన సాధన యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ కో ఆర్డినేటర్ ఉప్పర శేఖర్ సగర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో ఆవిష్కరించారు.
కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సాధన యాత్ర నిర్వహిస్తామన్నారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేషాచారి, కోఆర్డినేటర్ వేముల వెంకటేశ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.