calender_icon.png 6 February, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతా

06-02-2025 12:00:00 AM

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి 

నిజామాబాద్ (విజయ క్రాంతి): నిరుద్యోగులు విద్యార్థులు ఏకమై ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని తను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన వారి సమస్యలపై నిరంతరం పోరాడుతానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి హామీ ఇచ్చారు.

నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిజెపి పార్టీ తనను ఆశీర్వదించి బరిలో నిలిపిందని తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వని ఖరారు చేసిన ప్రధానమంత్రి మోడీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేశానని ఆర్‌ఎస్‌ఎస్ ఏబీవీపీకి సేవలు అందించిన అని తన సేవలను గుర్తించి అభ్యర్థిగా ఖరారు చేశారన్నారు.   

విద్యా సమస్యలపై నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ బిజెపి పార్టీ తరఫున అత్యధిక మెజార్టీ వచ్చేలా హామీ ఇచ్చిన జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారికి పల్లె గంగారెడ్డి లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.