calender_icon.png 30 October, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుగ్యారెంటీల అమలు కోసం పోరాడుతాం

14-08-2024 02:28:29 AM

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్, ఆగస్టు 13: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల పెన్నిధి అయ్యాడని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని చెల్పూర్, ఇందిరానగర్, రాజపల్లి, రాంపూర్, రంగాపూర్, పోతిరెడ్డిపేట, సిర్సపల్లి గ్రామాల్లో పర్యటించారు. తన సతీమణి శాలినిరెడ్డితో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహోత్తరమైన కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి పేదింటికి కేసీఆర్ మేనమామ అయ్యాడని చెప్పారు.

రైతుల కళ్లలో ఆనందం చూసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందని, ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయనవెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనవాస్, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్లు గందె రాధిక శ్రీనివాస్, తక్కలపెల్లి రాజేశ్వర్‌రావు, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఎంపీపీ రాణి పాల్గొన్నారు.