calender_icon.png 3 January, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయపరంగా ఎదుర్కొంటాం

31-12-2024 02:47:58 AM

  1. రేవంత్ సర్కార్‌వి పసలేని, పనికిమాలిన కేసులు  
  2. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టే బీఆర్‌ఎస్ నేతలపై కేసులు  
  3. హమీలు అమలు చేసేవరకూ ప్రభుత్వం వెంటపడతాం 
  4. గ్యారెంటీల నుంచి డైవర్షన్ కోసమే సినీరంగంపై రేవంత్ ప్రతాపం
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
  6. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్  

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తనపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయ పరంగానే ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ తనపై పసలేని, పనికిమాలిన కేసులు పెడుతుందని మండిపడ్డారు. అవినీతి జరగనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడు తుందని.

సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించా రు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం తమ చేతిలో ఉందని ప్రభు త్వం అడ్డగోలుగా కేసులు పెట్టిస్తున్నదని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానని తాను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు.

ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్న.. అదే మాట మీద నిలబడుతాననని ఉద్ఘాటించారు. మంత్రి పొన్నం ప్రభాక ర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని తేలిపోయిదని, అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రిని అడిగితే చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవాచేశారు.

సీఎం రేవంత్ ఫార్ము లా ఈ ప్రతినిధులతో కలిసిన ఫొటో బయటపెట్టడంతో అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ సంస్థ ను కలిసిన రేవంత్‌రెడ్డి వారిపై ఎందుకు కేసు పెట్టలేదని, వారితో జరిగిన సమావేశాన్ని ఏడాదిపాటు ఎందుకు దాచి ఉంచారని, వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడని తనకు అనుమానం ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి రూ.600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడని, అతనితో కాంటాక్టును రద్దు చేసుకోలేదని చెప్తున్న ముఖ్యమంత్రి.. ఫార్ములా ఈ రేసు ను ఏవిధంగా రద్దు చేసుకున్నారో సమాధా నం చెప్పాలని  డిమాండ్‌చేశారు. హైదరాబా ద్ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు చెల్లించినట్టు పునరు ద్ఘాటించారు. 

ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత   

కాంగ్రెస్‌పై వచ్చే వ్యతిరేకతతో తమ పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో ఉత్సాహం పెరిగిందని కేటీఆర్ అన్నారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని, రుణమాఫీ, రైతుభరోసాను ఇవ్వలేకపోయమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే భావిస్తున్నాయని ఎదేవాచేశారు. ప్రజలను మోసగించే కుట్రలతోనే నూతన సంవత్సరాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతుందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఈ సంవత్సరాని ధోకా నామ సంవత్సరంగా చెప్పుకొంటే బాగుంటుందని, ఇచ్చిన అడ్డగోలు హామీలు, గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీకి శాపాలై చుట్టుకున్నాయని అన్నారు. బీసీల కు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతున్నదని ఆగ్రహం  వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో విధ్వంసం, అటెన్షన్ డైవర్షన్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, ఈ ప్రభుత్వానికి ఈ త్రీ డీ ఫార్ములా ఉందని విమర్శించారు.

ఈ త్రీడీ ఫార్ములాని అమ లు చేస్తున్నది కేడీ సీఎం రేవంత్ అని విరుచుకుపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ప్రజల కో సం కాకుండా అల్లుడి కోసం అన్నదమ్ముల కోసం బావమరిది కోసం పనిచేస్తుందన్నా రు. కేంద్ర ప్రభుత్వం మాత్రం సివిల్ సప్లు కుంభకోణం, అమృత్ టెండర్ల కుంభకోణం మంత్రులపైై జరిగిన ఈడీ దాడి వంటి అం శాల నుంచి కాపాడుతుందని ఆరోపించారు. 

2025లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతామని కేటీఆర్ తెలిపారు. ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుందని, గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ర్ట స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నిక ల అంశంలో నిర్ణయం తీసుకొని కేటీఆర్ స్పష్టం చేశారు.

తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది వాస్తవమే

తనకు ఏసిబీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనని.. కానీ, ఈ ఎఫ్‌ఐఆ ర్ హైకోర్టు కొట్టి వేస్తే ఏం జరుగుతుం దో చూడాలని కేటీఆర్ అన్నారు. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుందని, ఏం జరుగుతుందన్నది చూడాలని, ఔట ర్ రింగ్ రోడ్డు పైనా ఆరోపణ చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఔటర్ రింగ్ రోడ్ లీజ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తనపై ఇప్పటికే అనేక కేసులను రాష్ర్టవ్యాప్తంగా నమోదు చేసినట్టు, తనను జైలుకు పంపాలని రేవంత్‌రెడ్డి ప్రయ త్నం చేస్తున్నాడని మండిపడ్డారు. అనేక రకాల అంశాలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ మొత్తం వ్యవహారంలో నాకు డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. అనుమానాలపైన కేసు లు ఉండవని కేవలం ఆధారాలపైన మాత్రమే ఉంటాయని గుర్తు చేశారు.

అటెన్షన్ డైవర్షన్ కోసమే సినీ నటులపై డ్రామా

ప్రచారం కోసం, ప్రజా సమస్యల నుంచి అటెన్షన్ డైవర్షన్‌లో భాగంగానే సినీ నటులపై రేవంత్‌రెడ్డి అడ్డగోలు మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. రాష్ర్టంలో జరిగిన మరణాలపైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్ల నుంచి సెటిల్మెంట్ చేసుకొని, ఇప్పుడు సైలెన్స్‌గా ఉన్నాడని విరుచుకుపడ్డారు.