న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తామని, ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ వాతావరణంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు అప్రమత్తమై ఉంటామని రిజర్వ్‌బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హో త్రా చెప్పారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాకు తన ప్రాధాన్యత లు వివరిస్తూ రిజర్వ్‌బ్యాంక్ వారసత్వానికి అనుగుణంగా ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు అన్ని విభాగాలతోనూ పరస్పర చర్చల్ని కొనసాగిస్తామన్నారు.
భాగస్వాములు అందరితో విస్త్రత చర్చలు జరపాల్సిన ప్రాధాన్యతను వివరిస్తూ విజ్ఞానం అంతా తమ గుత్తాధిపత్యం కాదని వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్థిక సేవల విస్తరణకు ఆర్బీఐ టెక్నాలజీని విస్త్రతంగా ఉపయోగిస్తుందని మల్హోత్రా తెలిపారు. దేశాన్ని వృద్ధిపథంలో నిలపాల్సిన పెద్ద బాధ్యతను నిర్వహిస్తామన్నారు.
బాధ్యతలు స్వీకారం
రిజర్వ్‌బ్యాంక్ 26వ గవర్నర్‌గా బుధవారం నాడు సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ కేంద్ర ఆర్థిక శాఖలో రెవిన్యూ కార్యదర్శిగా వ్యవహరించిన మల్హోత్రాకు సీనియర్ ఆర్బీఐ అధికారులు స్వాగతం పలికారు. డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్, రాజేశ్వరరావు, రబిశంకర్‌ల సమక్షంలో కొత్త గవర్నర్ బాధ్య తలు స్వీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేశా రు.
రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన మల్హోత్రా దేశ జీడీపీ వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్ఠస్థాయి 5.4 శాతానికి తగ్గి, ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించిన కీలక సమయంలో ఆర్బీఐ సారధ్య బాధ్యత లు చేపట్టారు. మల్హోత్రా నియామకంతో వచ్చే ఫిబ్రవరి సమీక్షలో ఆర్బీఐ రెపో రేటు ను తగ్గిస్తుందన్న అంచనాలను మెజారిటీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకూ ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించిన శక్తికాంత్‌దాస్ వరుసగా 11 పాలసీ సమీక్షల్లో వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టిన సంగతి తెలిసిందే.