16-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 15 (విజయ క్రాంతి) : బీసీ భవన్ ఏర్పాటు కు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బీసీ భవనం కేటాయించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీని వాస్ రెడ్డి నీ క్యాంపు కార్యాలయంలో కలిసి బీసీ కుల సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి బీసీ భవన్ కు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, బిసి కుల సంఘాల అందరికీ ఈ భవన్ ఎంతో మేలు చేకూరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి సి సంఘాల ప్రతినిధులు మోడల శ్రీనివాస్ సాగర్, సారంగీ లక్ష్మి కాంత్,బుగ్గన్న, రామచంద్రయ్య, చిట్యాల రాములు, వడ్డెర చంద్ర య్య,పురుషోత్తం, అశ్విని సత్యం,డి కృష్ణ, నాగప్ప, చంద్రశేఖర్, మల్లేష్,నగేష్ పాల్గొన్నారు.