calender_icon.png 8 November, 2024 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమలతో నష్టం జరగకుండా చూస్తం

08-11-2024 01:02:20 AM

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు నష్టం జరుగకుండా చూసే బాధ్యతను రైతు కమిషన్ తీసుకుంటుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. త్వరలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేసే మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నట్లు  ఆయన పేర్కొన్నారు.

గురువారం బీఆర్‌కే భవన్‌లో ఇంథనాల్ ఇండస్ట్రీ ఏర్పాటుపై కమిషన్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ పరిశ్రమలతో ఆరోగ్య సమస్యలతో పాటు పంటల దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుపక్షాలు తమ అభిప్రాయాలు కమిషన్‌కు తెలియజేయగా సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.

ఈసందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు రైతు కమిషన్ లేదని, అన్నదాతల శ్రేయస్సు కోసం సీఎం రేవంత్‌రెడ్డి కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి అక్కడ పరిస్థితులను తెలుసుకుంటామని, పొల్యూషన్ కాకుండా రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, భవానీరెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు.