10-03-2025 01:21:50 AM
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, మార్చి 9 (విజయ క్రాంతి): బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి కాల్వలకు ఎక్కువ నీటిని వదిలి గ్రామాల్లో సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మండలం లోని రత్తిపల్లి, బీరెల్లిగూడెం, పులిపల్పుల చెరువులను నింపేందుకు కాల్వలకు ఆది వారం నీటి విడుదలను ఆయన ప్రారంభిం చారు. పులిపలుపుల చెరువులోకి జలాలు చేరడంతో స్థానిక ప్రజాప్రతినిధులతో గంగమ్మకు వాయనం సమర్పించారు.
భూగర్భజలాలు పడిపోతున్నత రుణం లో సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా కృష్ణానీటితో చెరువులు నింపుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు నాంపల్లి మండల కేంద్రంలోని కోమటిరెడ్డి సుశీలమ్మ, ఫినిక్స్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
శంకర కంటి దవాఖాన వైద్యుల సహకారంతో శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భీమనపల్లి సైదులు, తోటి నారాయణ, నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.