* మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, జనవరి 15: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త వీరభద్రుడి ఆలయంలో సంక్రాంతి, కనుమ ఉత్సవం సందర్భంగా మంగళ, బుధవారాల్లో సందడి నెలకొంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతులు 50కిపైగా ఎడ్లబండ్లను రథాలుగా తీర్చాదిద్ది జాతరకు తీసుకొచ్చారు.
ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయంలో స్వామివారికి ఇష్టమైన గుమ్మడి కాయను, కోడె మొక్కులను, కోరమీసాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ చంద్రశేఖర్‌గుప్తా, ఈవో కిషన్‌రావు, డైరెక్టర్ కొంగొండ సమ్మయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కొత్తకొండ ఆలయ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. ముత్తారం గ్రామంలోని త్రికుటేశ్వర ఆలయాన్ని కలుపుకొని రెండు ప్రాంతాలను టూరిస్ట్ హబ్‌గా మారుస్తామన్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని.. రైతుల ఇంటా సిరి సంపదలతో నిండుగా ఉండాలన్నారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఇంటి నుంచి వచ్చిన రథానికి పీవీ కుమారులు పీవీ ప్రభాకర్‌రావు, పీవీ మదన్‌మోహన్‌లు జెండా ఊపి ప్రారంభించారు.జాతరలో సీపీ అంబర్ కిశోర్ ఝా కుటుంబసభ్యులతో కలిసి రంగుల రాట్నం ఎక్కి అలరించారు.