03-04-2025 01:34:42 AM
ఐ కొలాబ్ హబ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలోమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం రామ్ ఇన్ఫో లిమిటెడ్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటు చేసిన ‘ఐ కొలాబ్ హబ్ ఫౌండేషన్’ను ఆయ న లాంఛనంగా ప్రారంభించారు.
రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్తగా ఆలోచిస్తేనే విజయాన్ని అందుకోగలమని.. లేదంటే మన మనుగడే ప్రశ్నార్థక మవుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యం గా పరిశ్రమలు ఈ విషయంలో అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రా రంభించిన ప్రతి స్టార్టప్ విజయవంతం కాద ని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆలోచనలతో అడుగు ముందుకేస్తే నే సక్సెస్ అవుతుందన్నారు. కార్యక్రమం లో ఏపీ సీఎం ఐటీ సలహాదారు జేఏ చౌదరీ, రిటైర్ట్ ఐఏఎస్ ఆలోరియా జీఆర్, టీహబ్ సీ ఐవో సుజిత్ జాగీర్దార్, ఐకొలాబ్ హబ్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనాథ్‌డ్డి, బోర్డు మెంబర్ వర్ల భానుప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.