calender_icon.png 24 January, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహిస్తాం...

23-01-2025 08:45:32 PM

తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్...

ముషీరాబాద్ (విజయక్రాంతి): శాంతి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ముందుకు సాగడమే కాకుండా యువత రాజకీయాల్లోకి వచ్చేలా తమ పార్టీ ప్రోత్సహిస్తుందని తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్ స్పష్టం చేశారు. పార్టీ విధివిధానాలు ప్రకటించేందుకు నగరంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ... త్వరలోనే జిల్లాల అధ్యక్ష, కార్యదర్శిలను ఎన్నుకుంటామని తెలిపారు. అభివృద్ధి, ఐక్యత, వ్యవసాయంతో పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు తోడ్పాటు అందించడం తమ పార్టీ ఎజెండా అన్నారు.

రాష్ట్ర ప్రజలకు మార్గ దర్శనం చేస్తూ సరైన నాయకత్వం సూచించే దిశగా ముందుకు సాగుతాం అన్నారు. అబద్దపు హామీల గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని అన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు చేరుకూరి రత్నరాజ్, దాసరి శ్యాం లాల్, బంగారి రమేష్, చిలుక మల్లేశం, జన్ను ప్రభాకర్, కెఎన్.స్వామి దాస్, ఇమ్మానియల్, ఉదయ్ కుమార్, ప్రసంగి, సామ్యేల్, రాజా రత్నం, సోమన్న, సుధాకర్ పాల్గొన్నారు.