calender_icon.png 6 January, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగానికి తావు లేకుండా చేస్తాం

28-10-2024 01:39:49 AM

కరీంనగర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో నిరుద్యోగానికి తావు లేకుండా చేస్తామని, పట్టభద్రులకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ప్రారంభించి మాట్లాడారు.

‘వీఎన్‌ఆర్ ఇలు పేరిట ప్రత్యేక యాప్ రూపొందించడం అభినందనీయమన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో జిల్లాలో విద్యారంగానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.