calender_icon.png 22 October, 2024 | 12:22 AM

ఉప్పల్ అభివృద్ధికి శాయాశక్తుల కృషి చేస్తా : ఎమ్మెల్యే బండారి

21-10-2024 05:26:53 PM

కాప్రా, (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి శాయా శక్తుల కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అన్నారు. ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని త్యాగ రాయ నగర్ లో 30 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి గారితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.