calender_icon.png 29 October, 2024 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోప్రతిష్ఠ మహాయజ్ఞం చేస్తాం

29-10-2024 01:04:45 AM

  1. గోగర్జన సమావేశాలను నిర్వహిస్తాం
  2. తదుపరి కార్యాచరణను ప్రకటించిన శంకరాచార్య

బృందావన్, అక్టోబర్ 28: జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి దేశవ్యాప్తంగా చేపట్టిన గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర 36 రోజుల పాటు దిగ్విజయంగా సాగింది. సెప్టెంబర్ 22న రామజన్మభూమి అయోధ్య నుంచి ప్రారంభమైన యాత్ర శ్రీకృష్ణ జన్మస్థానమైన బృందావనంలో అక్టోబర్ 27న ముగిసింది.

యాత్ర పూర్తున తర్వాత బృందావనం చేరుకుని ఉదియా బాబాజీ దర్శనం చేసుకున్న స్వామీజీ అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు సోమవారం బయల్దేరారు. ఈ సందర్భంగా శంకరాచార్య బృందం ఓ ప్రకటన విడుదల చేసి అన్ని రాష్ట్రాలు ఆవును రాష్ట్రమాతగా ప్రకటించేవరకు కృషి చేస్తామని తెలిపారు. తమ తదుపరి కార్యాచరణను వెల్లడించారు. 

తదుపరి కార్యాచరణ 

* గోపాష్టమి (కార్తీక శుక్ల అష్టమి) రోజున శంకరాచార్య తన ప్రతినిధులను యాత్ర జరిగిన 36 రాష్ట్రాలకు పంపుతారు. వారు రాష్ట్రవ్యాప్తంగా గోసంరక్షణ పట్ల విస్తృత ప్రచారం కల్పిస్తారు.

* రాబోయే మహాకుంభ ఉత్సవం సందర్భంగా గోప్రతిష్ఠ మహాయజ్ఞాన్ని నిర్వ హించనున్నారు. 

* గోగర్జన సభ రాబోయే రోజుల్లో లక్షలాది మంది గోభక్తులు, సంరక్షకులను సమీకరించి గౌరవిస్తాం. ఎవరైతే గోరక్షణకు కృషి చేయరో వారిని హిందూ సమాజం నుంచి బహిష్కరిస్తాం.