calender_icon.png 29 September, 2024 | 10:57 AM

హైడ్రాతో నష్టపోతున్న పేదలకు మేలు చేస్తాం

28-09-2024 01:32:52 AM

కుట్రలో భాగంగానే మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు

గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): హైడ్రాతో నష్టపోతున్న బీద ప్రజల కు తమ ప్రభుత్వం ఆదుకుంటుందని పీసీసీ అధక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలో భాగమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్ర మంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆ రెండు పార్టీల లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 96 శాతం ప్రతిపక్షాల మీదనే దాడులు జరుగుతున్నాయని, ఇదంతా రాజకీయంగా లబ్ధి పొందడం కోసమేనని మండిపడ్డారు. భయపెట్టడానికి ఈడీ, సీబీఐలను వాడుకుంటు న్నారని, కేసులకు భయపడేది లేదని, అక్ర మ కేసులను రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొంటామన్నారు.

ప్రభుత్వ భూములను ఆక్ర మించుకున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రైతులకు ఎంత రుణమాఫీ చేసిం దో సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయమై మాజీ మంత్రి హరీశ్‌రావు చర్చకు సిద్ధమా అని మహేశ్ సవాల్ విసిరారు.