calender_icon.png 19 April, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌బోర్డు ఆదాయాన్ని పేదలకు పంచుతాం

18-04-2025 12:27:52 AM

  1. వక్ఫ్ భూములన్నింటినీ డిజిటలైజ్ చేస్తాం
  2. చట్టరూపకల్పనకు కోటి మందికిపైగా మేధావులు, ప్రజల అభిప్రాయాలను సేకరించాం
  3. వక్ఫ్ సవరణ చట్టంపై వర్క్ షాపులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
  4. తెలంగాణలో వక్ఫ్ ఆదాయ వివరాలను సీఎం రేవంత్, ఒవైసీ చెప్పాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): వక్ఫ్ చట్టాన్ని సవరించి పేద ము స్లింలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని గతంలో బీజేపీ హామీ ఇచ్చిందని, ఆమేరకు వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి  పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలకు పంచుతామని చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. 

ఈ బిల్లును రూపొందించేందుకు కేంద్రం 2024, ఆగస్టులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ సుమారు 25 రాష్ట్రాల్లో పర్యటించి, కోటిమందికి పైగా మేధావులు, ప్రజల అభిప్రా యాలను సేకరించిందన్నారు. కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా నివేదిక సమర్పించి, పార్లమెంటులో 21 గంటల పాటు చర్చ జరిపినట్లు ఆయన వెల్లడించారు.

బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో గురువారం జరిగిన ‘వక్ఫ్ సుధార్ జనజాగరణ అభియాన్’ వర్క్‌షాప్ లో కిషన్‌రెడ్డి ప్రసంగించారు..  దేశంలో రైల్వే, రక్షణ శాఖల తర్వాత అత్యధిక భూములు వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్నాయని, కానీ, ఆ భూముల ఆదాయం పేద ముస్లింలకు ఉపయోగపడడంలేదని కిషన్‌రెడ్డి వెల్ల డించారు.

వక్ఫ్ బోర్డు లాభం మజ్లిస్ పార్టీ నాయకులు, మతపెద్దలు, ల్యాండ్ గ్రాబర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే పొందారని ఆరోపించారు. పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు నుంచి ఎంత మేలు జరిగిందో అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్‌గాంధీ చెప్పగలరా?, పైగా ల్యాండ్ మాఫియా ప్రచారానికి మద్ద తు తెలుపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం వక్ఫ్ ఆస్తులను సక్రమంగా వినియోగిస్తే ప్రతీ సంవత్సరం రూ.12 వేల కోట్ల ఆదాయం రావచ్చన్నారు.

పేదలకు ఎంత పంచారు...

తెలంగాణలో వక్ఫ్ బోర్డు పరిధిలో 77 వేల ఎకరాల భూమి, 35 వేల ప్రాపర్టీలు ఉన్నాయని, వాటి ఆదాయ వివరాలు రేవం త్ రెడ్డి, ఒవైసీ చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులను కాంగ్రెస్ ముస్లిం నాయకులు, మజ్లిస్ నేతలు తమ రాజకీయ అధికారం పెంచుకునేందుకు వినియోగించుకున్నారని తెలిపారు. వక్ఫ్ బోర్డు పరిధిలో బినామీ పేర్లతో వందల కమ్యూనిటీ హాళ్లు నిర్మించారని, వాటి ఆదాయం దారుస్సలాంకు ఉపయోగించబడుతోంది తప్పా..

పేద ముస్లింలకు ప్రయోజనం లేదని మండిపడ్డారు.  ఇకపై వక్ఫ్ భూములన్నింటినీ డిజిటలైజ్ చేసి, యేటా ఆడిట్ చేసి, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించడం జ రుగుతుందన్నారు. ఈ వర్క్‌షాప్ అనంతరం జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజల అనుమానాలు నివృత్తి చేస్తుందని, వక్ఫ్ సవరణ చట్టానికి ప్రజల మద్దతు పొందేలా పనిచేయాలన్నారు.