రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి
బీసీ కుల గణనపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఈ విషయంపై బీసీ కమిషన్‌లో చర్చించి తదుపరి విధివిధానాలను ప్రకటిస్తాం. మూడు నెలల్లో కుల గణన పూర్తవుతుందో లేదో అనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం ఎన్నికల సంఘంతో చర్చించాల్సి ఉన్నది. బీసీ కులగణన ఆషామాషీగా చేపట్టేది కాదు. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి కూడా ఆ డాటాను బయటకు విడుదల చేయలేదు. ఆ తప్పు ఇప్పుడు మళ్లీ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. బీసీలకు అన్ని విధాలా న్యాయం జరిగేలా కుల గణన చేపట్టాలనేది మా లక్ష్యం.