calender_icon.png 2 April, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని తవ్వి తీస్తాం

28-03-2025 01:59:27 AM

  1. మీరు బిల్లులు పెండింగ్ పెడితే మేం చెల్లిస్తున్నాం
  2. డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి) :  బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖలో జరిగిన ఆర్థిక విధ్వంసం మొత్తాన్ని తవ్వితీస్తానని, ఉన్న విషయాలను సభ, రాష్ర్ట ప్రజల ముందు పెట్టి వివరిస్తానన్నారు.

తాను యాదృచ్ఛికంగా పొలిటికల్ లీడర్‌ను కాలేదని, ఫ్యూడల్ వ్యవస్థలో, భావ దారిద్య్రం, అనిచివేతలో కూరుకుపోయిన వారిని బయటపడేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ద్రవ్యవినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ‘సంక్షేమమే మాకు ప్రాధాన్యత రంగం. అర్థవంతమైన అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించాం. బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ, స్త్రీ సంక్షేమం కోసం  రూ.70,474 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదు

రాష్ర్టంలో 86 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి బీఆర్‌ఎస్ హయాంలో నిధులు ఖర్చు చేయలేదని సామాజిక, ఆర్థిక సర్వే ద్వారా నిర్ధారణ చేసుకున్నాం. అందుకే రాష్ర్ట చరిత్రలోనే సంక్షేమం కోసం తొలిసారి అత్యధికంగా రూ.1,44,156 కోట్లను కేటాయించాం. రూ.40 వేల కోట్ల బిల్లులు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. వాటి భారం మేం మోస్తున్నాం. అలాగే ఉద్యోగులకు మీరు పెట్టిన రూ.20వేల కోట్ల బకాయిల్లో మేము రూ.16వేల కోట్లు క్లియర్ చేశాం’ అని డిప్యూటీ సీఎం వివరించారు. 

అప్పులు చేసి మాపై వదిలేశారు.. 

‘లక్ష కోట్లు అప్పును తీసుకుని లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్‌లో చెల్లించే విధంగా బీఆర్‌ఎస్ ఒప్పందం చేసుకుంది. బీఆర్‌ఎస్ చేసిన అప్పులకు పదేళ్ల తర్వాత చెల్లింపులు ప్రారంభం అయ్యా యి. ఆ భారం మాపై పడింది. బీ ఆర్‌ఎస్‌లా 20 శాతం  అంచ నాలు పెంచకుండా వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. దశాబ్దా లుగా ఎస్సీ వర్గీకర ణ సమస్య పరిష్కారం కాలేదు. మా ప్రభు త్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టి, సమస్యను పరిష్కరించింది.

న్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేసి తీరు తాం. ఆరు గ్యారెంటీల కోసం బడ్జెట్లో రూ.56,084 కోట్లు కేటాయించాం. నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకున్న మేము రూ. 6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు ప్రవేశ పెట్టాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమి తిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. గత పదేళ్లలో ఆరోగ్యశ్రీకి రూ.540 కోట్లు కేటాయిస్తే మేము మొదటి ఏడా దిలోనే రూ.1205 కోట్లు కేటా యించాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.