- సరస్వతి నది పుష్కరాలకు ఏర్పాట్లు
- మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ
- మహా కుంభాభిషేకానికి హాజరు
మంథని, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి)/మహాదేవపూర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పాటుపడతామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదా శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
కాళేశ్వరం ముక్తేశ్వర క్షేత్రంలో ఆదివారం జరిగిన మహా కుంభాభిషేక మహోత్సవానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మం తులు మాట్లాడుతూ.. కాళేశ్వరం అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మే నెలలో 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతి నది పుష్కరాలకు ప్రభుత్వం తరఫున రూ.25 కోట్లు మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తామని, నూతన పనులను ప్రారంభించామని తెలిపారు.
బట్టలు మార్చుకొని గదులు, మరుగుదొడ్లు, వివిధ రకాల పనులు చేస్తున్నట్లు తెలిపారు. నూతన మోడల్ బస్టాండ్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, అచలాపురం వేద పాఠశాల వ్యవస్థాపకుడు దుద్దిల మనోహర్‌శర్మ అవధాని, దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీధర్, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాలయ ప్రధాన అర్చకులు త్రిపురారి కృష్ణమూర్తి శర్మ, ఆల కార్యనిర్వణాధికారి మహేశ్, మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మహిళా మండల అ బందెల సత్తెమ్మ, మాజీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వామన్‌రావు, మాజీ జడ్పీటీసీ అరుణ పాల్గొన్నారు.