calender_icon.png 22 March, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్ల బస్టాండ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

22-03-2025 02:16:08 AM

కంట్రోలర్-  లాలయ్య గౌడ్

చర్ల, మార్చి 21 (విజయ కాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల చర్ల మండలంలో గల బస్టాండ్ ప్రాంగణంను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని బస్టాండ్ కంట్రోలర్ లాలయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం బస్టాండ్ ప్రాంగణాన్ని శుబ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు.

బస్టాండ్ అనగానే ఒకప్పుడు గుర్తొచ్చేది నిర్మానుష ప్రాంతంగా ఉండేది. గతంలో పనిచేసిన డిపో మేనేజర్ రామారావు చర్ల బస్టాండ్ అభివృద్ధి కోసం చుట్టు ప్రహరీ ,బస్టాండ్ కి రంగుల కల తీసుకొచ్చారు., వారు బదిలీపై వెళ్లగా ఇప్పుడు నూతనంగా వచ్చిన భద్రాచలం బస్ డిపో మేనేజర్ తిరుపతిరావు చర్ల మండలం బస్టాండ్ అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నారు.

అందులో భాగంగానే గతంలో ఎక్కడపడితే అక్కడ వాహనాలతో నిండిన ద్విచక్ర వాహన ,ఆటో ,లారీ వాహనాలు నిలుపుదల చేసేవారు,బయటి వాహనాలతో నిత్యం హస్తవ్యస్తంగా ఉండేది, అపరిశుభ్రత వాతావరణం కొట్టచ్చినట్లు కనిపించేది అలాంటిది ఇక్కడికి నూతనంగా రెండు నెలల క్రితం బస్టాండ్ కంట్రోలర్ (ఎస్ ఎం) గా గంధసిరి లాలయ్య గౌడ్ ను నియమించారు, లాలయ్య గౌడ్ తనదైన పని తీరును చూపిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు..

బస్టాండ్ ప్రాంగణంలోని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి రిఫ్రిజిరేటర్ ని ఏర్పాటు చేసి దాహం తీరుస్తున్నారు, ఇతర వాహనాల నిలుపుదలను అరికట్టడం . నిత్యం పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం. ప్రయాణికులను ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ వారి గమ్యస్థానాలకు చేరే విధంగా బస్సుల రాక పోకాలను తెలియ చేస్తూ  పని పట్ల నిబద్దలతో స్ట్రిక్ట్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.

చర్ల బస్టాండ్ ఇప్పుడు కొత్త రూపు దాల్చుకో పోతుంది బస్టాండ్ ప్రాంగణం అంతా చదును చేయిస్తూ బస్టాండ్ కు కొత్త కళ తీసుకొస్తున్నారు. వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలపకుండా ఉచిత పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేసి వాహనాలు ఆ ప్రాంతంలో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకునేందుకు శ్రీకారం చుట్టారు,  త్వరలో డి ఎం ఒ తిరుపతిరావు ఆధ్వర్యంలో చర్ల మండల ప్రముఖుల సహాయ సహకారాలతో ఆర్వో ప్లాంట్ ను బస్టాండ్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తను పనిచేసిన అంత కాలం చర్ల బస్టాండ్ అభివృద్ధి కోసం పనిచేస్తానని, ఎటువంటి అమాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా లచూసే బాధ్యత తనదంటూ చెప్పుకొచ్చారు . బస్టాండ్ అభివృద్ధికి దోహదపడుతున్న లాలయ్య గౌడ్ ను చర్ల మండల ప్రజలు ప్రశంసిస్తున్నారు