వీసీ గోవర్ధన్
భైంసా, అక్టోబర్ 18 : బాసర ఆర్జీయూకేటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి విద్యార్థులను ప్రయోజకులను చేస్తామని నూతన వీసీ గోవర్ధన్ అన్నారు. శుక్రవారం ఆయన బాసర ఆర్జీయూకేటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా పరిపాలనాధికారి రణధీర్ ఆయనను పుష్పగుచ్ఛంతో స్వాగతించారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆయా విభాగాలను సందర్శించారు.
విద్యార్థి సంక్షేమ సంఘాల నాయకులు, విద్యార్థులు, అధికారులు సమావేశమయ్యారు. అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిం చేందుకు అన్ని విధాల చర్యలు చేపడతామన్నారు. ఇతర విశ్వవిద్యా లయాల కంటే ఉన్నతంగా గుర్తింపు పొందే విధంగా శాస్త్రసాంకేతిక విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాలోను విద్యార్థులు ఎదిగేలా ప్రోత్సహిస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో నెలకొన్న పెండింగ్ సమ స్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.