calender_icon.png 13 March, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు సహకారం అందించి అభివృద్ధి పరుస్తాం: మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్

13-03-2025 06:50:02 PM

మద్నూర్,(విజయక్రాంతి): వ్యవసాయ మార్కెట్ కమిటీలో సభ్యులుగా ఉన్న రైతులకు సహకారం అందించి అభివృద్ధి పరచడమే తమ పాలకవర్గ ఉద్దేశం అని మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్(Madnoor Market Committee Chairman Soujanya Ramesh) అన్నారు. గురువారం మద్దూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సౌజన్య రమేష్ పరమేశ్ పటేల్ మాట్లాడుతూ పాలకవర్గం కామారెడ్డి ఉమ్మడి జిల్లా లోనే పత్తి పంట కొనుగోళ్లలో ఎంతో రైతులకు ఉపయోగపడిందన్నారు. మద్నూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం గురువారం ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ సౌజన్య రమేష్ మాట్లాడుతూ.. రైతులకు సహకారం మార్కెట్ కమిటీ అభివృద్ధి పరచడమే పాలకవర్గ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మద్నూర్ మార్కెట్ కమిటీ ఆదాయం గురించి చర్చించినట్టు తెలిసింది. ఈ సాధారణ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ పాలకవర్గం సభ్యులు ఇన్చార్జి సెక్రెటరీ శ్రీకాంత్ ఏఎంసి కార్యాలయ  సూపర్వైజర్  లు సిబ్బంది పాల్గొన్నారు.