calender_icon.png 23 February, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తాం

23-02-2025 12:02:00 AM

విద్యాకమిషన్‌తో సీఎం సమీక్ష

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాం తి): ప్రభుత్వ బడుల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులతో శనివారం జూబ్లీహి ల్స్‌లోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

విద్యా వ్యవస్థ బలోపేతంపై కమి షన్ రూపొందించిన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు, చారగొండ వెంకటే శ్, జ్యోత్స్న శివారెడ్డి అందజేశారు.

రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌తో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కమిషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

స్కూళ్లకు కంప్యూటర్లు మంజూరు..

ప్రభుత్వబడులకు విద్యాశాఖ కంప్యూటర్లు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 972 స్కూళ్లకు 2,472 డెస్క్‌టాప్‌లు, 972 ప్రింట ర్లు, యూపీఎస్‌లను అందజేశారు.