calender_icon.png 1 October, 2024 | 12:51 AM

అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రూపొందిస్తాం

19-09-2024 12:04:03 AM

భువనేశ్వర్: అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా తెలంగాణ క్రీడా సంస్థలను తీర్చిదిద్దుతామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ న్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో త్వరలో స్పోర్ట్స్ యునివర్సిటీ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధికార బృందం బుధవారం ఒడిస్సాలోని భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను సందర్శించింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని వివిధ క్రీడాంశాల్లో ఇస్తున్న క్రీడాశిక్షణ తీరును పరిశీలించిన బృందం.. క్రీడాకారులకు కల్పిస్తున్న మౌళిక సదుపాయాలు, వసతులపై ఆరా తీసింది. రాష్ట్రంలో భవిష్యత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ, స్కూల్‌ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేపట్టింది. ఈ బృందంలో వైస్ చైర్మన్ సోనీ బాలాదేవి,           రతన్‌కుమార్, రవికుమార్‌లు ఉన్నారు.