calender_icon.png 22 April, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం

09-04-2025 06:11:14 PM

జుకంటే రాజ గౌడ్...

చేగుంట (విజయక్రాంతి): ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తలపెట్టిన జై బాబు, జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి విజయవతం చేయాలని నార్సింగ్ మండల కోఆర్డినేటర్ జుకంటి రాజగౌడ్ అన్నారు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ... నన్ను నర్సింగ్ మండల కోఆర్డినేటర్ గా నియమించినందుకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్,  కార్యక్రమమును నార్సింగ్ మండలంలో త్వరలో తలపెట్టే కార్యక్రమాని మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధుల, సహకారంతో, మండలంలో విజయవంతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బిజెపి పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామాల్లో తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామన్నారు. నాటినుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ముందుండి పనిచేస్తున్న కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో ముందుండి నడిపిస్తామన్నారు.

బిజెపి పార్టీలో కొంతమంది పెట్టుబడుదారుల కోసం ప్రభుత్వ సంస్థలను, పెట్టుబడుదారులకు, దారా దత్తం, చేస్తుందని విమర్శించారు. దేశంలో ప్రజావసరాల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టిన ఆస్తులను అంబానీ, ఆధాని, వశం చేయడానికి చేస్తున్న బిజెపి, కుట్రలను, విధి, విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. మహాత్మాగాంధీ స్వాతంత్ర ఉద్యమం చరిత్రను చేరిపి వేసే విధంగా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కేందుకు కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. అట్టి ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటామని తెలిపారు. దీనికి ప్రజలు మద్దతు పలకాలని కోరారు. దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని దానికి అందరూ సహకరించాలని కోరారు.