మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్
సిద్దిపేట, సెప్టెంబరు 26 (విజయక్రాంతి): సిద్దిపేట మున్సిపల్ అధికారులు చెరువుల బఫర్ జోన్‌లో నిర్మాణలపై కొరడా ఝులిపించారు. ఎర్రచెరువు బఫర్ జోన్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం కూల్చివేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణలు చేపట్టిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పట్టణంలోని 5వ వార్డులో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి మున్సిపల్ అనుమతులు పొంది నిర్మాణం చేపడుతున్న ఓ ఇంటి గదిని, ప్రహరీని కూల్చివేశారు. మున్సిపల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చెపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటమని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు దేవరాజు, నస్రీన్‌బాను, స్రవంతి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
సయ్యద్‌గూడలో..
రాజేంద్రనగర్, సెప్టెంబర్26: మండల పరిధిలోని చిన్నగోల్కొండ గ్రామ అనుబంధ గ్రామం సయ్యద్‌గూడలోని సర్వే నంబర్24లో ప్రభుత్వ స్థలం ఉండగా.. ఇది తమ స్థలం అని కొందరు అందులో ప్రహరీలు నిర్మించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రవీందర్ దత్తు గురువారం ఆర్‌ఐలు కృష్ణ, సారిక రెవెన్యూ సిబ్బందితో కలిసి జేసీబీల సాయంతో సంబంధిత స్థలంలోని ప్రహరీలను నేలమట్టం చేశారు. సర్కార్ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.