25-04-2025 07:28:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలు ఉద్యోగుల పట్ల ఎనలేని గౌరవం ఉందని వారి సమస్యల పరిష్కారానికి తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిష్కారం చూస్తారని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు(DCC President Srihari Rao) అన్నారు. శుక్రవారం పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయనకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాల నేతలు వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వం దృష్టికి 55 డిమాండ్లను పెట్టడం జరిగిందని ఉద్యోగ సంఘం నేతలు శ్రీహరి రావుకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఇన్ సి లింగన్న నరేంద్రబాబు రమణారావు భూమన్న యాదవ్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పెంట అశోక్ దాసరి శంకర్ వై అశోక్ కూడాల రవికుమార్ పల్సర్ పీజీ రెడ్డి రమేష్ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.