calender_icon.png 6 February, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌ను బొంద పెడతాం

06-02-2025 01:47:17 AM

మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మాలలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో బొంద పెడతామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ జీ చెన్నయ్య మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాల ఆధ్వ  బుధవారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

ధర్నా  చెన్నయ్య మాట్లాడుతూ.. 2011 జనాభా గణాంకాలలో ఉపకులాల గణన జరగలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ చేయడం సరైంది కాదన్నారు. మంత్రివర్గ ఉపసంఘంలో ఒక్క మాల మంత్రి లేకపోవటంతో మాలలకు అన్యాయం జరిగిందన్నారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం మాలలకు ద్రోహం చేశారన్నారు. మాలలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసేందుకు మంద కృష్ణ మాదిగ, ఏపీ సీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు.

ధర్నా చేస్తున్న మాల జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మాల సంఘాల జేఏసీ కోషూ బూర్గుల వెంకటేశ్వర్లు, చెరుకు రాంచందర్, గోపోజు రమేష్, కరణం కిషన్, మన్నె శ్రీధర్‌రావు, ప్రదీప్, మంచాల లింగస్వామి, రాజు వస్తాదు తదితరులు పాల్గొన్నారు.