calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణిచేస్తాం

14-04-2025 12:56:26 AM

 చాకుతో బైక్ పై ప్రదర్శనలు చేసిన షేక్ సలీం అరెస్ట్.

ఆదిలాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : జిల్లాలో రౌడీయిజానికి తావు లేదని, రౌడీలు రౌడీయిజం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అదిలాబాద్ రూరల్ మండలం బంగారుగూడ కు చెందిన షేక్ సలీం అలియాస్ కైంచి సలీం బైక్ పై నోట్ ల్లో కత్తి పెట్టుకొని ప్రదర్శనలు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారణంగా ఆయనపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

నోట్లో కత్తులు పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, కత్తులతో ప్రజల వద్దల డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సలీమ్ ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి చాకు (కత్తి) ని స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. సలీమ్ ఇదివరకే ఏడు కేసులలో ముద్దాయిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.  మీడియా సమా వేశంలో పలువురు పోలీస్‌లు, తదితరులు పాల్గొన్నారు.