calender_icon.png 16 January, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం

15-07-2024 12:05:00 AM

ఏపీ హోం మంత్రి అనిత 

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : ఆంధ్రప్రదేశ్‌ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. శనివారం డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై మద్యం మత్తులో యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పారావును ఆదివారం హోంమంత్రి పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామన్నారు. పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థుర్యైంతో పని చేయాలని సూచించారు.