calender_icon.png 7 March, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తాం

07-03-2025 01:59:30 AM

సీఎం రేవంత్‌ను కలిసిన టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి తాము సహకరిస్తామని నూతన టీచర్ ఎమ్మెల్సీ పింగలి  శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం అనంతరం శ్రీపాల్ రెడ్డి గురువారం సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీపాల్‌రెడ్డిని రేవంత్ శాలు వాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్ష న్ విధానాన్ని వర్తింపచేయాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరగా.. సీఎం అందుకు అంగీ కరించినట్లు శ్రీపాల్ రెడ్డి తెలిపారు. సీఎంను కలిసిన వారిలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పుల్గం దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకట్ రెడ్డి, మా జీ ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ ఉన్నారు.