హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రారంభించనున్న ఆరోగ్య ప్రణాళికలకు సహకరిస్తామని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సచివాలయంలో గురువారం ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్యం, హక్కుల పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. మహిళా-శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజ సమావేశంలో పాల్గొని ట్రాన్స్‌జెండర్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ ప్రణాళికలపై చర్చించారు.