calender_icon.png 16 March, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం

16-03-2025 01:29:23 AM

బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

చార్మినార్, మార్చి 15 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా అభివృద్ధి చేస్తామని కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేస్తారు. కరీంనగర్ పట్టభద్రు ల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన అంజిరెడ్డి, మల్కా కొమురయ్య, బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి శనివారం ఓల్డ్ సిటీలోని చార్మినార్ భాగ్యలక్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్‌పర్సన్ శశికళ వారిని సాదరంగా ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడు తూ.. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని కాద ని మేధావులు, విద్యావంతులు బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని పేర్కొన్నా రు.

తమ విజయానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కేంద్ర సహాయమంత్రి బండి సంజ య్ చార్మినార్ అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే మాట నిలబెట్టుకుంటామన్నారు. ఇటీవల గ్రూప్  పరీక్ష ల్లో చాలా అవకతవకలు జరిగాయని, ప్రభు త్వం స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.